అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం(24 గంటల్లో) 8,368 కరోనా కేసుల నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 5,06,493కు చేరింది. తాజాగా, 70 మంది కరోనా బారినపడి మృతిచెందారు. మొత్తంగా కరోనా మృతుల సంఖ్య 4,487కు చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ను విడుదల చేసింది. 24 గంటల్లో 10,055 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తంగా 4,04,074 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒకేరోజు 58,187 శాంపిళ్ల టెస్ట్ చేయగా.. ఇప్పటివరకు 41,66,077 నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 97,932 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 584, చిత్తూరు 875, ఈస్ట్‌గోదావరి 1,312, గుంటూరు 765, కడప 447, కృష్ణా 193, కర్నూలు 316, నెల్లూరు 949, ప్రకాశం 419, శ్రీకాకుళం 559, విశాఖపట్నం 405, విజయనగరం 594, వెస్ట్‌గోదావరి 950 చొప్పున పాజిటివ్ కేసుల చొప్పున నమోదయ్యాయి.