సారథి న్యూస్, హైదరాబాద్: ఏపీలో కొత్తగా ఆదివారం 755 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 50 మందికి, బయటి దేశాల నుంచి వచ్చిన 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇలా రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,098కు చేరింది. గత 24 గంటల్లో 25,778 శాంపిల్స్‌ను పరీక్షించగా 755 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా మహమ్మారితో కర్నూలులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు.
- June 28, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- CARONA
- POSITIVE
- ఏపీ
- కరోనా
- Comments Off on ఏపీలో 755 మందికి కరోనా