అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి పెరుగుతోంది. కేసులు నాలుగు లక్షలు దాటేశాయి. శనివారం (24 గంటల్లో )10,548 మందికి కరోనా ప్రబలింది. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో 4,14,164 కేసులు నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తే అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మహమ్మారి బారినపడి తాజాగా 82 మంది మృతిచెందగా.. ఇప్పటివరకు మృతుల సంఖ్య 3,796కు చేరింది. 24 గంటల వ్యవధిలో 62,024 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఒకరోజులో రోగం నుంచి కోలుకుని 8,976 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 3,12,687 మంది కోలుకుని ఇంటిబాట పట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం 97,681 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 36,03,345 మందికి మెడికల్ టెస్టుల ద్వారా వ్యాధి నిర్ధారణ చేశారు.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 864, చిత్తూరు 813, ఈస్ట్ గోదావరి 1,096, గుంటూరు 635, కడప 991, కృష్ణా 362, కర్నూలు 791, నెల్లూరు 1,038, ప్రకాశం 870, శ్రీకాకుళం 522, విశాఖపట్నం 988, విజయనగరం 715, వెస్ట్ గోదావరి 863 చొప్పున పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.