అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మంగళవారం 9,652 కరోనా కేసులు నమోదుయ్యాయి. ఇప్పటివరకు మొత్తంగా 3,03,366 పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. తాజాగా, వ్యాధిబారిన పడి 88 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తంగా 2,820 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు చికిత్స అనంతరం 2,15,416 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 85,130కు చేరింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురం 445, చిత్తూరు 990, ఈస్ట్ గోదావరి 1396, గుంటూరు 895, కడప 755, కృష్ణా 281, కర్నూలు 830, నెల్లూరు 684, ప్రకాశం 725, శ్రీకాకుళం 405, విశాఖపట్నం 928, విజయనగరం 513, వెస్ట్ గోదావరి 805 చొప్పున పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది.
- August 18, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- AMARAVATHI
- ANDRAPRADESH
- CARONA
- అమరావతి
- ఆంధ్రప్రదేశ్
- కరోనా
- పాజిటివ్ కేసులు
- Comments Off on ఏపీలో 3లక్షలు దాటిన కేసులు