Breaking News

ఏపీలో ఉద్యోగాల భర్తీ


సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు సీఎం వైఎస్​ జగన్ మోహన్​రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్యారోగ్య శాఖలో 9,712 పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతులు ఇచ్చింది. దీనికి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. వాటిలో 2,153 రెగ్యులర్, 5,574 కాంట్రాక్టు పోస్టులు, 1,985 ఔట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి. అలాగే డీపీహెచ్ పరిధిలో 3167 పోస్టులను, మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 4131, ఏపీవీవీపీ పరిధిలో 2414 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఇతర ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలిన 17,097 పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు రంగం సిద్దం చేయాలని సీఎం వైఎస్​ జగన్ మోహన్​రెడ్డి అధికారులను ఆదేశించారు.