సారథి న్యూస్, వాజేడు, ములుగు: కొమరం భీమ్ 80వ వర్ధంతిని ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథులుగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో ఆదివాసీల హక్కులు, ఆదివాసీ ప్రజలకు కనీస భద్రత కరువైందన్నారు. ఆదివాసుల భూములకు పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం వారిపై దాడులు కొనసాగిస్తే ‘జల్, జంగిల్, జమీన్’ కోసం మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎల్ఆర్ఎస్అమలుచేయడం సరికాదన్నారు. ఐటీడీఏ ప్రాంతంలో రావాల్సిన ఉద్యోగాలు అక్రమంగా ఏజెన్సీ సర్టిఫికెట్ పొందిన లంబాడీలకే గుట్టుచప్పుడు కాకుండా ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కాక నర్సింగరావు, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ని బెళ్లి, గణేష్ కార్యదర్శి సిద్దబోయిన కార్తీక్, బిర్సాముండా యూత్ అధ్యక్షుడు రేగ రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కొర్ణిబెళ్లి, ఫణికుమార్, నరేష్ పాల్గొన్నారు.
- October 31, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ADIAVSI
- AGENCY AREA
- KOMARAMBHEEM
- LRS
- MULUGU
- ఆదివాసీ
- ఎల్ఆర్ఎస్
- కొమరం భీమ్
- ములుగు
- వాజేడు
- Comments Off on ఏజెన్సీ ప్రాంతంలో ఎల్ఆర్ఎస్ వద్దు