Breaking News

ఎస్సీ, ఎస్టీ యువత ఆర్థికంగా ఎదగాలె

ఎస్సీ, ఎస్టీ యువత ఆర్థికంగా ఎదగాలె

సారథి న్యూస్, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన సహాయం అందించడంతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీఎం కె.చంద్రశేఖర్​రావు కట్టుబడి ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్ తెలిపారు. సోమవారం బీఆర్కే భవన్ లో డీఐసీసీఐ (దళిత్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్) బృందం ప్రభుత్వ కార్యదర్శిని కలిసి 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత గిరిజన యువత పారిశ్రామికరంగంలో ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. డీఐసీసీఐ ద్వారా వ్యవస్థాపకతను పెంపొందించేందుకు చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. చీఫ్​ సెక్రటరీని కలిసిన వారిలో డీఐసీసీఐ ప్రతినిధులు దాసరి అరుణ, నర్రా రవికుమార్, రాహుల్ కిరణ్, సురేష్ నాయక్, మున్నయ్య, తమన్, మునిందర్, రమేష్ నాయక్, వెంకటేశ్వరరావు, పరమేష్ ఉన్నారు.