చెన్నై: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ నెల 5న బాలుకు కరోనా సోకడంతో చెన్నైలోని ఏజీఎం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన వెంటనే కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
- August 14, 2020
- Archive
- Top News
- సినిమా
- CARONA
- CHENNAI
- FANS
- POST
- SERIOUS
- SOCIALMEDIA
- SP BALU
- ఎస్పీబాలు
- సినీగాయకుడు
- Comments Off on ఎస్పీ బాలు పరిస్థితి విషమం