సారథి న్యూస్, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం)కు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం అక్టోబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఆగస్టు 26 వరకు కటాఫ్ డేట్‌గా ప్రకటిస్తూ ఎల్ఆర్ఎస్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ ఫీజును రూ.వెయ్యిగా నిర్ణయించారు. లే అవుట్ అప్లికేషన్ ఫీజును రూ.10వేలుగా ఖరారు చేసింది. 100 గజాలలోపు ప్లాటు కలిగి ఉన్న వాళ్లు రెగ్యులరైజేషన్ ఛార్జీల కింద గజానికి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. 100 నుంచి 300 గజాల వరకు రూ.400 రెగ్యులరైజేషన్ ఛార్జీలు ఖరారు చేశారు. 300 నుంచి 500 వరకు గజానికి రూ.600 రెగ్యులరైజేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలతో పాటు పంచాయతీలకు కూడా ఈ స్కీం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.
- September 2, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- LAND REGULARATION
- LRS
- TELANGANA
- ఎల్ఆర్ఎస్
- తెలంగాణ
- ల్యాండ్రెగ్యులరైజేషన్
- Comments Off on ‘ఎల్ఆర్ఎస్’ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ రేటు ఎంతో తెలుసా?