తమిళనాడుకు చెందిన కళ్లకురిచచి ఎమ్మెల్యే ప్రభు(34) ప్రేమ వివాహం రచ్చ రచ్చగా మారింది. ఎమ్మెల్యే ప్రభు.. సౌందర్య అనే బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి సౌందర్య తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అర్చకుడిగా పనిచేస్తున్న ఆయన తన కూతురు ఎమ్మెల్యే కిడ్నాప్ చేశాడని.. ఆమె ఇంకా మైనర్ అంటూ మద్రాస్ హై కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసుపై బుధవారం కోర్లు విచారించనున్నది. ఇప్పటికే సౌందర్య పోలీసుల వద్దకు వచ్చి తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. ఇష్టపూర్తిగానే పెళ్లి చేసుకున్నానని చెప్పినట్టు సమాచారం. ‘మేం నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నాం. నేను తనను కిడ్నాప్ చేశాననే మాట అవాస్తవం. వివాహం అయ్యాక మేం సౌందర్య తల్లిదండ్రుల ఆశీస్సుల కోసం వారి ఇంటికి వెళ్లాం. కానీ వారు మమ్మల్ని తిరస్కరించారు. ఈ పెళ్లికి మా తల్లిదండ్రుల అనుమతి ఉంది’ అని ఎమ్మెల్యే ప్రభుత తెలిపారు.
- October 6, 2020
- Archive
- Top News
- జాతీయం
- MARRAIGE
- MLA
- TAMILNADU
- TEMPLE
- ఎమ్మెల్యే
- కులాంతరవివాహం
- తమిళనాడు
- తెలంగాణ
- పెళ్లి
- హైదరాబాద్
- Comments Off on ఎమ్మెల్యే పెళ్లి.. రచ్చ రచ్చ