- కరోనా మృతుడికి అంత్యక్రియలు
- పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్
- బాధిత కుటుంబంలో ధైర్యం నింపేందుకే..
సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్‌తో ప్రపంచమే యుద్ధం చేస్తోంది. వ్యాధి వచ్చిందంటే చాలు ఇరుగు పొరుగు వారే కాదు.. కుటుంబసభ్యులే దగ్గరకు పరిస్థితి వచ్చింది. కానీ బాధిత కుటుంబంలో ధైర్యం నింపేందుకు ఓ ఎమ్మెల్యే గొప్ప సాహసమే చేశారు. పీపీఈ కిట్లు కట్టుకుని మృతుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన ఎవరో కాదు.. కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్. నగరంలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. శనివారం అంత్యక్రియల్లో ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కోవిడ్ బాధితులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందేలా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. కరోనా పాజిటివ్‌తో 98శాతం కోరుకుంటున్నారని, దురదృష్టవశాత్తు రెండుశాతం మంది చనిపోతున్నారని అన్నారు. ఎంత మర్యాదగా బతికారో.. అంతే గౌరవంగా వాళ్ల అంత్యక్రియల్లో పాల్గొన్నామన్నారు. ఎవరైనా భయంతో అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రాకపోతే మున్సిపల్ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.