సారథి న్యూస్, రామడుగు: పేద యువతి వివాహానికి సహాయంచేసి ఓ ఎన్ఆర్ఐ పెద్దమనసు చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన తోట సత్యం అమెరికాలో స్థిరపడ్డారు. తన సొంత గ్రామానికి చేతనైన సాయం చేస్తుంటాడు. రామడుగుకు చెందిన జిట్టవేని రజిత అనే యువతికి కొంతకాలం క్రితం తల్లిదండ్రులు చనిపోయారు. ఈ క్రమంలో ఆమె వివాహానికి సత్యం రూ.20వేల సాయం చేశారు. ఈ మొత్తాన్ని గ్రామ సర్పంచ్ ప్రమీల జగన్మోహన్గౌడ్ కు పంపించగా ఆమె బాధిత యువతికి అందజేశారు. యువజన కాంగ్రెస్ నాయకుడు నాగిశేఖర్, వార్డు సభ్యుడు నీలం రవి తదితరులు పాల్గొన్నారు.
- August 4, 2020
- Archive
- ఎన్ఆర్ఐ
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- KARIMNAGAR
- NRI
- RAMADUGU
- ఎన్నారై
- రామడుగు
- Comments Off on ఎన్ఆర్ఐ ఔదార్యం