సారథి న్యూస్, మెదక్: టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. బుధవారం మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్, హవేలీ ఘనపూర్ మండలాలకు సంబంధించిన 35 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. యాసంగి పంటకు యథావిధిగా రాష్ట్రంలోని రైతులందరికీ రూ.7,200 కోట్లతో రైతుబంధు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా 80నుంచి 90 శాతం వరకు సబ్సిడీతో బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా ప్రభుత్వమే లబ్ధిదారులకు రుణాలు అందజేస్తోందన్నారు. అత్యంత పారదర్శకంగా ఎస్సీ సబ్‌ప్లాన్‌ను అమలుచేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- December 2, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- మెదక్
- షార్ట్ న్యూస్
- CM KCR
- KALYANA LAKSMHI
- medak
- MINISTER HARISHRAO
- SHADIMUBHARAK
- కళ్యాణలక్ష్మి
- తెలంగాణ
- మంత్రి హరీశ్‌రావు
- మెదక్
- షాదీముబారక్
- సీఎం కేసీఆర్
- Comments Off on ఎన్ని ఇబ్బందులొచ్చినా పథకాలను కొనసాగిస్తాం