Breaking News

‘ఎన్నిక వాయిదా’ కాంగ్రెస్​ కుట్రే

సారథిన్యూస్​, గోదావరిఖని: కుట్రపూరితంగానే కాంగ్రెస్​ నాయకులు హైకోర్టుకు వెళ్లి రామగుండం నగరపాలక సంస్థ కో ఆప్షన్​ ఎన్నికను వాయిదా వేయించారని టీఆర్​ఎస్ నేతలు ఆరోపించారు. మంగళవారం టీఆర్​ఎస్​ నాయకులు పాతపల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్ గౌడ్ రామగుండం ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్​ పరిధిలో టీఆర్​ఎస్​కు 39 మంది కార్పొరేటర్లు ఉండగా కాంగ్రెస్​కు 11 మంది మాత్రమే ఉన్నారు. కార్పొరేటర్ల మెజార్టీతో టీఆర్​ఎస్​కు చెందిన వ్యక్తి కో​-ఆప్షన్​ సభ్యుడిగా ఎన్నికవుతారని చెప్పారు. దీంతో కాంగ్రెస్​ నేతలు కుట్రపూరితంగానే కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. మీడియా సమావేశంలో టీఆర్​ఎస్​ నేతలు సీహెచ్​ మొగిలి, నారాయణ దాస్ మారుతి, దీటీ బాలరాజు, బొడ్డు రవీందర్, వెతుకు దేవరాజు, అచ్చ వేణు, నూతి తిరుపతి, ఖాజా సిరొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.