Breaking News

ఎంజీఎం సూపరింటెండెంట్​ రాజీనామా

సూపరింటెండెంట్​ రాజీనామా

సారథిన్యూస్​, వరంగల్​: ఉమ్మడి వరంగల్​ జిల్లాలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన అయిన ఎంజీఎం సూపరింటెండెంట్​ డాక్టర్​ శ్రీనివాసరావు రాజీనామా చేశారు. తాను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని అందుకే రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. కాగా ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో జరిగిన పరిణామాల వల్లే అతడు రాజీనామా చేసినట్టు సమాచారం. తెలంగాణలోని పలువురు వైద్యులు కరోనా పరిణామాలతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల జూనియర్​ డాక్టర్లు ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎంజీఎం సూపరింటెండెంట్​ రాజీనామా సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఇంచార్జి సూపరింటెండెంట్​గా డాక్టర్​ వెంకటేశ్వర్​రావును నియమించింది. ఆయన ఎంజీఎంలోని ఆర్థోపెడిక్​ డిపార్ట్​మెంట్​కు హెడ్​గా విధులు నిర్వర్తిస్తున్నారు.