సారథి న్యూస్, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లోపలికి వర్షపు నీరు వచ్చిన నేపథ్యంలో గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. అక్కడ బిల్డింగ్ మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్పిటల్ ప్రాంగణంలో తిరిగి పర్యవేక్షించారు. మంత్రి హాస్పిటల్ వెలుపల పేషెంట్ వార్డులను పర్యవేక్షించారు వైద్యులతో పేషంట్ స్థితిగతులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య అధికారులు సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు తదితరులు మంత్రి వెంబడి ఉన్నారు.