సారథి న్యూస్, రామాయంపేట: జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాలను 200 రోజులకు పెంచాలని దళిత బహుజలన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పీ శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం నిజాంపేట మండలం చల్మెడలో జాతీయ ఉపాధి హామీ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాక్ డౌన్ తో నిరుద్యోగం పెరిగి లక్షలమంది గ్రామాలకు తిరిగి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో డీబీఆర్సీ జిల్లా కో ఆర్డినేటర్ దుబాషి సంజివ్ బుచ్చయ్య, మల్లేశం, పరుశరాములు, స్వామి, రాజు, లక్ష్మి నవీన్ భాగ్య పద్మ పాల్గొన్నారు.
- June 29, 2020
- Archive
- LOCKDOWN
- medak
- RAMAYAMPETA
- డీబీఆర్సీ
- రామాయంపేట
- Comments Off on ‘ఉపాధి’ పనిదినాలు పెంచండి