సారథిన్యూస్, రామడుగు: ఎన్ని సార్లు ప్రయత్నించినా ఉద్యోగం రావటం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన మడ్డి లచ్చయ్యకు ముగ్గురు కుమారులు, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటంతో, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్న కుమారుడు పవన్‌కల్యాణ్ (23) ఇటీవల ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఉద్యోగం రాకపోవడంతో ఇంట్లోని దూలానికి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అనూష తెలిపారు.
- July 7, 2020
- Archive
- కరీంనగర్
- క్రైమ్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KARIMNAGAR
- RAMADUGU
- SUCIDE
- ఉద్యోగం
- రామడుగు
- Comments Off on ఉద్యోగం రాలేదని..