Breaking News

ఉద్యమకారులను అవమానించొద్దు

సారథిన్యూస్​, కొత్తగూడెం: తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలను అవమానించొద్దని భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్నీ) పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగూడెంలో ఉద్యమకారుల స్థూపాన్ని శ్మశానవాటిక అయిన ప్రగతి మైదానంలో నిర్మించడమేమిటని ప్రశ్నించారు. పాత అమరవీరుల స్థూపం ఉన్నచోట కొత్త స్థూపాన్ని నిర్మించాలని డిమాండ్​ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.