Breaking News

ఇన్​స్టాలో దుమ్మురేపుతున్న సమంత

ఇన్​స్టా దుమ్మురేపుతున్న సమంత

అందాల భామ సమంత అక్కినేని సోషల్​ మీడియాలో దుమ్మురేపుతోంది. ఒకప్పుడు తెలుగులో టాప్​ హీరోయిన్​గా వెలిగిన సమంత .. చైతూతో పెళ్లి తర్వాత డీలా పడింది. అయినప్పటికీ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓ బేబీ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. తాజాగా ఈ భామ ఇన్​స్టాగ్రామ్​లో 11 మిలియన్ల ఫాలోవర్స్​ హృదయాలను గెలుచుకుంది. నిత్యం తన సినిమాలు, ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలు పంచుకుంటూ నెట్టింట్లో హల్​చల్ చేస్తోంది. ఈ ఏడాది జాను సినిమాతో ప్రేక్షకులను అలరించిన సమంత.. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌లో నటించనున్నట్టు ప్రకటించింది.