Breaking News

ఇదేం ప్రజాస్వామ్యం.. ఎంపీల సస్పెన్షన్​పై నిరసన

ఢిల్లీ: తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ నిన్న రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదించిన సంగతి చెలరేగింది. బిల్లు చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో చైర్మన్​ పోడియం దగ్గరకు వెళ్లి పెద్దపెట్టు నినాదాలు చేశారు. కాగా సభలో అనుచితంగా ప్రవర్తించిన ఎనిమిది మంది ఎంపీలపై సోమవారం రాజ్యసభ చైర్మన్​ వెంకయ్యనాయుడు సస్పెండ్​ వేటు వేశారు. వారంపాటు వీరిని సభనుంచి బహిష్కరించారు. సోమవారం సభ ప్రారంభంకాగానే మంత్రి ప్రహ్లద్​జోషి సస్పెన్షన్​ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైర్మన్​ వెంకయ్యనాయుడు ఆమోదించారు. మరోవైపు సస్పెన్షన్‌ను ఎంపీలు వ్యతిరేకించారు. ‘ ఇదేం ప్రజాస్వామ్యం’ అంటూ నినాదాలు చేశారు. వివేక్‌ ఓబ్రెయిన్‌, నాసిర్‌ హుస్సేన్‌, సంజయ్‌సింగ్‌, రుపిన్‌ బోరా, డోలాసేన్‌, రాజీవ్‌ వాస్తవ్‌, కేకే రాజేశ్‌, కరీమ్‌లు పై సస్పెన్షన్​ వేటు పడింది.