Breaking News

ఇంటర్​ ఫలితాలు తెలుసుకోండి ఇలా

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు జూన్ 18న విడుదల కానున్నాయి. మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. అయితే ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఫలితాలు విడుదల చేయాలనుకున్నారు. అందుకే ఫలితాల విడుదలకు ఆలస్యమైంది. గురువారం సాయంత్రం 4 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. బుధవారం సాయంత్రం ఇంటర్ బోర్డు సెక్రటరీ ఒమర్ జలీల్ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశమై ఇంటర్ ఫలితాల గురించి చర్చించనున్నారు. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ తో పాటు ఇతర వెబ్‌సైట్లలో ఫలితాలు తెలుసుకోవచ్చు.

ఇంటర్ ఫలితాలను https://telugu.news18.com/ వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలైన వెంటనే సమాచారం తెలుసుకోవాలంటే https://telugu.news18.com/ వెబ్‌సైట్‌లో విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ విండోలో విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ లేదా సెకండ్ఇయర్ సెలెక్ట్ చేసి, పూర్తి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ వెల్లడించి రిజిస్టర్ చేసుకోవాలి. తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేసిన వెంటనే విద్యార్థులకు సమాచారం అందుతుంది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో ఇంటర్ ఫలితాలు ఇలా చూడండి..
ముందుగా https://tsbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో ఇంటర్ ఫలితాలకు సంబంధించిన లింక్ పైక్లిక్ చేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్‌కు వేర్వేరు లింక్స్ ఉంటాయి. లింక్ క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 9.65 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.