Breaking News

ఆ గ్యాంగ్​ చాలా డేంజర్​

బాలీవుడ్​లో డేంజరస్ యాప్​

బాలీవుడ్​లో ఉన్న ఓ డేంజరస్​ గ్యాంగ్​ వల్లే తనకు హిందీ సినిమాల్లో అవకాశాలు రావడం లేదని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్​ విన్నర్​ ఏఆర్​ రెహమన్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరైనా అవకాశం ఇద్దామనుకున్న వెంటనే ఆ గ్యాంగ్​ ఎంటర్​ అయి తనపై దుష్ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. సుశాంత్​ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ చీకటి వ్యవహారాలపై ఒక్కొక్కరూ నోరు విప్పుతున్నారు. తాజాగా ఏఆర్ రెహమాన్ బాలీవుడ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు.

సుశాంత్ చివరి చిత్రం అయిన ‘దిల్ బేచార’కు రెహమాన్ సంగీతం అందించారు. ఆ సినిమా దర్శకుడు ముఖేష్ చాబ్రా తన దగ్గరకు వచ్చేటప్పుడు ఆయనకు కూడా తన విషయంలో ఎన్నో చెప్పారన్నారు. కానీ ముఖేష్ చాబ్రాకు కేవలం రెండు రోజుల్లోనే ట్యూన్స్ ఇచ్చానన్నారు. అయితే.. ముఖేష్ మాటల తర్వాత తనకు చాలా విషయాలు అర్థమయ్యాయన్నారు. ఇంతకాలం హిందీలో తనకు ఎందుకు తక్కువ సినిమాలు వస్తున్నాయో కూడా తెలిసిందన్నారు. హిందీలో ఆయన ‘దిల్‌ సే’, ‘తాళ్‌’, ‘లగాన్‌’, ‘స్వదేశ్‌’, ‘రంగ్‌ దే బసంతి’, ‘గురు’, ‘రాక్‌స్టార్‌’, ‘తమాషా’, ‘ఓకే జాను’ తదితర హిందీ చిత్రాలకు సంగీతద ర్శకుడిగా పని చేశారు రెహమాన్. దాదాపు స్వరపరిచిన పాటలన్నీ పెద్ద హిట్​ కావడం విశేషం.