Breaking News

ఆస్ట్రేలియాలో సచిన్, కోహ్లీ వీధులు


మెల్​బోర్న్: ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. వాళ్లకు సంబంధించిన వస్తువులు, ఫొటోలను అభిమానులు తమ ఇళ్లలో పెట్టుకుని ఆరాధిస్తుంటారు. అలాంటి క్రికెటర్లలో సచిన్, కపిల్, కోహ్లీ.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. అయితే ఆసీస్​లో అభిమానులు మరో అడుగు ముందుకేస్తూ తమ వీధులకు క్రికెటర్ల పేర్లను పెట్టుకున్నారు. మెల్​బోర్న్​లోని రాక్​బ్యాంక్ ప్రాంతంలోని ఓ ఎస్టేట్​లో వీధులకు ‘టెండూల్కర్ డ్రైవ్’,‘కోహ్లీ క్రీసెంట్’, ‘దేవ్ టెర్రెస్’ అని పేర్లు పెట్టుకున్నారు. మెల్టన్ కౌన్సిల్లోకి వచ్చే రాక్​బ్యాంక్ ప్రాంతంలో ఎక్కువగా భారతీయలు ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు. ఇంకాస్త లోపలికి వెళ్లే ‘వా స్ట్రీట్, మియాందాద్ స్ట్రీట్, ఆంబ్రోస్ స్ట్రీట్, కలిస్ వే, హ్యాడ్లీ స్ట్రీట్, అక్రమ్ వే అని పేర్లు కూడా కనిపిస్తుంటాయి. భారతీయలు పేర్లతో వీధులు కనిపించడంతో అమ్మకాలకు భారీ స్పందన వస్తుందని ఎస్టేట్ నిర్వహణాధికారి తెలిపారు. ధోనీ, ద్రవిడ్, సంగక్కర పేర్లకు సిటీ కౌన్సిల్ నుంచి ఆమోదం రావాల్సి ఉందన్నారు.