న్యూఢిల్లీ: ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించే సామర్థ్యం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఉందని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. కరోనాను అద్భుతంగా కట్టడి చేసిన ఆ దేశం.. ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వడం పెద్ద కష్టమేమీ కాదన్నాడు. అయితే ఇంగ్లండ్‌లో వెస్టిండీస్ పర్యటన విజయవంతమైతే.. వరల్డ్‌కప్‌కు మరింత లైన్ క్లియర్ అవుతుందన్నాడు. ‘విండీస్.. ఇంగ్లండ్‌లో పర్యటించడం శుభవార్త. క్రికెట్ పునరుద్ధరణ కావడం మరింత ఆనందం. ఈ రెండు జట్ల మధ్య జరిగే సిరీస్.. ప్రపంచానికి ఓ కొత్త బాట వేయబోతుంది. ఇది విజయవంతమైతే.. ప్రపంచకప్‌నకు తలుపులు తెరుచుకున్నట్లే’ అని భజ్జీ పేర్కొన్నాడు. లాక్డౌన్ కాలంలో కొన్ని సానుకూల విషయాలను నేర్చుకున్నానని చెప్పిన హర్భజన్.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ ఫిట్నెస్తో ఉన్నానని చెప్పుకొచ్చాడు.
- June 14, 2020
- Archive
- Top News
- క్రీడలు
- AUSTRALIA
- HARBAJAN SINGH
- టీ20 ప్రపంచకప్
- హర్భజన్ సింగ్
- Comments Off on ఆసీస్‌కు ఆ సత్తా ఉంది