హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఆర్డీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ ఆర్డీవోగా ఎస్.మోహన్‌రావు నియమితులయ్యారు. అలాగే ఎల్లారెడ్డి ఆర్డీవోగా ఎస్.శ్రీను, ఆందోల్-జోగిపేట ఆర్డీవోగా వి.విక్టర్, వనపర్తి ఆర్డీవోగా పి.అమరేందర్, నిర్మల్ ఆర్డీవోగా రాథోడ్ రమేష్, బాన్స్ వాడ ఆర్డీవోగా బి.రాజాగౌడ్, మేడ్చల్-మల్కాజ్‌గిరి ఎస్డీసీగా జి.లింగ్యానాయక్ నియమితులయ్యారు.