Breaking News

ఆర్జీవీ తర్వాత టార్గెట్​ బాలయ్యేనా?

ఇప్పటికే ‘పవర్​స్టార్​’ అనే సినిమా తీసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ.. తర్వాత మరో అగ్రనటుడు బాలకృష్ణను టార్గెట్​ చేయబోతున్నట్టు సమాచారం. 16 ఏండ్ల క్రితం బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో బెల్లంకొండ సురేశ్​ గాయపడ్డాడు. తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసు మరుగున పడింది. ఆ రాత్రి బాలయ్యబాబు ఇంట్లో ఏం జరిగిందో అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరి మనస్సులోనూ ఉండిపోయింది. అయితే కాలక్రమేణా ఆ ఘటనను అందరు మరిచిపోయారు. కానీ ఆర్జీవీ మాత్రం ఇప్పడు సరిగ్గా అదే అంశాన్ని కథాంశంగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారంటూ ఫిలింనగర్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక వేళ నిజంగా ఆర్జీవీ ఆ కథాంశాన్ని తెరకెక్కిస్తే స్వయంగా ఆయన ప్రకటిస్తాడని మరికొందరు అంచనా వేస్తున్నారు. మరోవైపు మిర్యాలగూడ కులహత్యోదంతంపై కూడా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించడం.. దానిపి ప్రణయ్​ భార్య అమృత కేసుపెట్టింది కూడా. కాగా రాంగోపాల్​వర్మ మాత్రం కొత్త సినిమాలు ప్రకటిస్తూ వాటిన ఓటీటీలో రిలీజ్​ చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. ఇక బాలయ్య సినిమాపై ఎప్పుడు ప్రకటిస్తాడో వేచిచూడా