Breaking News

ఆన్​లైన్​ పాఠాలు ప్రారంభం

సారథిన్యూస్, రామడుగు: కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థుల చదువు భారంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి టీ శాట్- దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు విద్యాబోధన అందిస్తుంది. మంగళవారం తొలిరోజు విద్యార్థులకు టీవీ పాఠాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలకేంద్రంలోని వివిధ గ్రామాల్లో విద్యార్థులు టీవీల ముందు కుర్చొని పాఠాలు విన్నారు. కానీ సిగ్నల్​ లేకపోవడం, పవర్​పోవడం వంటి సమస్యలు తలెత్తాయి.