సారథి న్యూస్, చొప్పదండి: ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ పట్టణ ఉపాధ్యక్షుడు అనుమల్ల కోటేశ్ డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు కరోనా సాకుతో ఆన్లైన్ క్లాసులంటూ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని శక్తిభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా సమయంలో అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలన్నారు. చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంతోష్, సాయి గణేష్, లక్ష్మీపతి, అఖిల్, సాయి తదితరులు పాల్గొన్నారు.
- July 1, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- ABVP
- BJP
- ONLINE CLASSES
- SCHOOLS
- TELANGANA
- ఏబీవీపీ
- విద్యాసంస్థలు
- Comments Off on ఆన్లైన్ క్లాసుల పేరిట దోపిడీ