సోషల్ మీడియాలో చిలిపిగా పోస్టులు పెట్టే అదా శర్మ కెమెరా ముందుకి వచ్చేసరికి పెర్ఫామెన్స్ అదరగొడుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ చిత్రం ‘కమాండో 3’లో ఇన్స్పెక్టర్ భావనారెడ్డిగా ఆకట్టుకుంది. రీసెంట్ గా ఆదా తెలుగులో రెండు సినిమాలకు కమిట్ అయింది. అందులో ఓ థ్రిల్లర్ మూవీలో నటించడానికి రెడీఅయింది. కొత్త డైరెక్టర్స్ విప్రా దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీకి ‘క్వశ్చన్ మార్క్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరీకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు.
హైదరాబాద్లో మొదటి షెడ్యూల్, నిర్మల్ లో రెండో షెడ్యూల్ తో ఈ మూవీ షూటింగ్ ప్లాన్ చేశారు. రీసెంట్గా ఆదా లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే సెట్స్ కి వెళ్లిన ఈ మూవీలో సంజయ్, భానుశ్రీ, అభయ్, హరితేజ, అక్షిత శ్రీనివాస్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దీంతోపాటు మరో సినిమా షూటింగ్ లోనూ ఆదా పాల్గొంటోంది. మొన్నటివరకు హోమ్ క్వారంటైన్ ను సరదాగా గడిపేస్తూ..సోషల్ మీడియాలో ఫొటో షూట్ లు, చాట్ లతో అందరినీ అలరించిన ఆదా ఇప్పుడు వరుస షూటింగులతో బిజీబిజీగా గడుపుతోంది.