సారథి న్యూస్, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్ సందర్శించారు. ప్రభుత్వ అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు రానున్న రోజుల్లో ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పనిచేస్తాయని అన్నారు. సీసీఎఫ్ఆర్ శోభతో కలిసి మూడు గంటల పాటు కలియతిరిగి పరిశీలించారు. హైదరాబాద్ చుట్టుపక్కల పెద్దమొత్తంలో ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయని, ఔటర్ రింగ్ రోడ్ కు ఐదు కి.మీ. పరిధిలో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులను డెవలప్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ ప్రశాంతి తదితరులు ఉన్నారు.
- June 13, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- MEDCHAL
- OXIZEN PARK
- ఆక్సిజర్ పార్క్
- కండ్లకోయ
- సీఎస్
- సోమేశ్‌కుమార్
- Comments Off on ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పార్కులు