Breaking News

అహ్మద్‌పటేల్‌ ఇంటికి ఈడీ

అహ్మద్‌పటేల్‌ ఇంటికి ఈడీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత అహ్మద్‌ పటేట్‌ను మనీలాండరింగ్‌ కేసులో విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఈడీ బృందం శనివారం ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లింది. సందేశారా సోదరుల రూ.వేలకోట్ల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన ప్రశ్నించనున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు చెప్పారు. విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే రెండు సార్లు సమన్లు జారీ చేశారు.

అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో వృద్ధుడైన తాను విచరాణకు హాజరు కాలేనని అన్నారు. దీంతో ఈడీ అధికారులే ఆయన ఇంటికి వెళ్లారు. గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ సంస్థ, ఆంధ్రా బ్యాంక్‌ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణాలను పొంది.. ఆ తర్వాత చెల్లింపులు లేకపోవడంతో నిరర్ధక ఆస్తిగా ప్రకటించారు. దీంతో సీబీఐ అక్టోబర్‌‌ 2017లో ఎఫ్‌ఐఆర్‌‌ నమోదు చేసింది. నీరవ్‌ మోడీకి సంబంధం ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం కంటే సందేశారా సోదరుల కుంభకోణం మరింత పెద్దదని ఈడీ గతంలో ప్రకటించింది.