బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. దీపికనే కాదు మరో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా ప్రభాస్ కు జంటగా నటించబోతోందన్న వార్త వైరల్ అవుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ రూపొందించనున్న త్రీడీ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. సీత పాత్ర కోసం చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి.
ఇప్పుడీ వరుసలో అనుష్కశర్మ పేరు కూడా చేరింది. ఓం రౌత్ చెప్పిన స్క్రిప్ట్ వినగానే ఇంప్రెస్ అయిన అనుష్క వెంటనే ఓకే చెప్పిందని, ఆమె ఎంపిక కన్ఫర్మ్ అయిపోయిందని ముంబై మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అసలు విషయం ఏమిటంటే అనుష్క శర్మ ప్రస్తుతం గర్భిణి. ఇటీవలే ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో పాటు జనవరి డ్యు డేట్ అని కూడా రివీల్ చేశారు. మరోవైపు ‘ఆదిపురుష్’ షూటింగ్ స్టార్ట్ అయ్యేది కూడా జనవరిలోనే. డెలివరీ తర్వాత అనుష్కశర్మ తిరిగి షూటింగ్‌లో పాల్గొనడానికి కనీసం ఐదారు నెలలైనా పట్టొచ్చు. అంతేకాదు సినిమాలకు తగిన ఫిజిక్ వచ్చేందుకు అనుష్కకు ఇంకొంత సమయం పట్టొచ్చు.
ఈ చిత్రం లో విజువల్ ఎఫెక్ట్స్ కు ఇంపార్టెన్స్ ఎక్కువ.. పైగా త్రీడీ మూవీ. ఒకవేళ అనుష్క శర్మ కోసం ఎదురుచూస్తే పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతుంది. ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఓం రౌత్ ఆమెనే ఎందుకు తీసుకున్నట్టు. మరో హీరోయిన్ ఎవరూ లేనట్టుగా తనని తీసుకుని రిస్క్ చేయాల్సిన అవసరం లేదు కదా. అందుకే ‘ఆదిపురుష్’లో అనుష్క శర్మ నటించడం నమ్మశక్యంగా లేదు. సినిమా స్టార్టింగ్ లో ఊర్వశి రౌతేలాని తీసుకోబోతున్నట్టు కూడా ఇలాగే వార్తలొచ్చాయి. ఆ వార్తలను ఖండించిన ‘ఆదిపురుష్’ టీమ్ అతి త్వరలో ఈ విషయంపై కూడా క్లారిటీ వచ్చేదాకా వేచిచూడాల్సిందే.