సారథిన్యూస్, రామడుగు: బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి అమానుషమని చొప్పదండి నియోజవర్గ బీజేపీ కన్వీనర్ జిన్నారం విద్యాసాగర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే నేతలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో నాయకులు పొన్నం శ్రీను, పోచంపల్లి నరేశ్, కల్లెం శివ, వెంకటేశ్, అజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- July 13, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- ARVIND
- ATTACK
- BJP
- MP
- WARANGAL
- అర్వింద్
- నిజామాబాద్
- Comments Off on అర్వింద్‌పై దాడి అమానుషం