Breaking News

అభిమానుల కోసమేనట..

బాలనటిగా ఇండస్ట్రీకొచ్చినా వయసుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటూ కెరీర్ లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది నటి మీనా. అయితే దానికి బ్రేక్ చెప్పాలనుకుంటున్నా.. నెగెటివ్, చాలెంజింగ్ పాత్రలను కూడా చేయాలనుకుంటున్నానని గతంలో ‘అన్నాత్త’ సినిమా ఓపెనింగ్ సమయంలో తన మనసులోని అభిప్రాయాలను చెప్పింది మీనా. తనకి తగ్గా పాత్రలు చెయ్యాలి అనుకున్నా.. ఇప్పుడు మాత్రం ఏ పాత్రైనా చెయ్యడానికి సిద్ధపడుతోందట. ఎందుకంటే తెలుగు తమిళ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని.. ట్రెండ్ కి తగ్గట్టుగా తనని తాను మలచుకున్నాని అంటోంది. అందుకు సాక్ష్యం పోయినేడు మీనా ప్రధాన పాత్రగా వచ్చిన ‘కరోలిన్ కామాక్షి’ తమిళ వెబ్ సిరీసే నట.

ఈ సిరీస్ బోల్డ్ కంటెంట్ తో ఉన్నా ఇందులో మీనా సిబిఐ ఏజెంట్ గానటించింది. కాకపోతే ఆ రోల్ కామెడీగా ఉంటుంది. సినిమాల్లో చేయని ఫైట్స్ ఈ సిరీస్ లో చేసింది. ఒకే పాత్రతో కామెడీ..సీరియస్ చేసి మెప్పించింది. ‘నటనకు సిద్ధమైనప్పుడు ఇలాగే నటించాలని ఫిక్సవకూడదు. ఏ పాత్ర చేసేందుకైనా సిద్ధపడాలి. నేనెప్పుడూ సినిమాల్లో నెగెటివ్ రోల్ చేయాలి అనుకోలేదు. నాకు అవి రాలేదు కూడా. కానీ ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. ఫ్యాన్స్ ఎక్కువ చాలెంజింగ్ రోల్స్ నే ఇష్టపడతారని అర్థమైంది. వాళ్ల అభిరుచికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నా..’ అంటూ ఏ పాత్ర చేసేందుకైనా సిద్ధమేనని అంటోంది మీనా.