సారథి న్యూస్, శ్రీకాకుళం: దేశంలో సుపరిపాలన అందించే మనసున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తింపు పొందారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలంలో నాలుగవ రోజు సోమవారం మొదలైన సంఫీుభావ యాత్రలో ఆయన పాల్గొన్నారు. లింగావలసలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రజాచైతన్యయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలేసిన వారి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర చేపడితే ఆనాటి పాలకులు కష్టాల పాలుచేశారని, అప్పుడే తాను ప్రజల మధ్యలో ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారని గుర్తుచేశారు. ఆయన చిత్తశుద్ధి, దృఢసంకల్పాన్ని ప్రజలు గుర్తించారని అన్నారు. వ్యవసాయరంగం, సంక్షేమరంగం, ఫీజు రీయింబర్స్ మెంట్, పింఛన్, ఆరోగ్యశ్రీ.. ఇలా సంక్షేమం, సుపరిపాలన పేరుతో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న అనేక పథకాలను నేడు జాతీయంగా చర్చిస్తున్నారని చెప్పారు. పాదయాత్ర ద్వారా ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించిన జగన్ వారి నుంచి స్ఫూర్తి పొందిన ఫలితంగానే నేడు ఏపీలో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని వివరించారు. యువనాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మెండ విజయశాంతి, రాంబాబు, కొయ్యాన సుశీల, కోన దాము, ఎం.శ్యామరావు, ఆరంగి మురళీధర్, చింతు రామారావు, గుప్తా, రాజాపు అప్పన్న, పంగ బావాజీ నాయుడు పాల్గొన్నారు.
- November 9, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- CM YS JAGAN
- DHARMANA
- PRAJACHAITANYA YATHRA
- SRIKAKULAM
- ధర్మాన కృష్ణదాస్
- ప్రజాచైతన్యయాత్ర
- ఫీజు రీయింబర్స్మెంట్
- శ్రీకాకుళం
- సీఎం జగన్
- Comments Off on అన్ని వర్గాలకూ సమన్యాయం