Breaking News

అన్నింటికీ సౌలత్​ ఉండాలె

అన్నింటికీ సౌలత్​ ఉండాలె
  • నూతన సెక్రటేరియట్ పై సీఎం కేసీఆర్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు. వీటిలో కొన్ని మార్పులను సూచించారు. కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణంపై బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియట్ లో అందరూ పనులు చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. కొత్త సెక్రటేరియట్ లో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్స్ కూడా అన్ని సౌకర్యాలతో ఉండాలన్నారు.

ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాలు, మీటింగ్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, అన్ని వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉండేలా నిర్మాణం ఉండాలని సీఎం సూచించారు. సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్​ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎంవో అధికారులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఎన్​సీలు గణపతిరెడ్డి, రవీందర్ రావు, అధికారులు సతీష్, మధుసూదన్ రెడ్డి, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆస్కార్-పొన్ని అర్కిటెక్స్ట్ నిపుణులు పాల్గొన్నారు.