సారథిన్యూస్, అన్నవరం: ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్నది. దాదాపు అన్ని జిల్లాలకు వ్యాధి విస్తరించింది. కేసులతోపాటు మరణాల సంఖ్య అధికంగానే ఉన్నది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో 39 మంది సిబ్బందికి కరోనా సోకింది. శుక్రవారం 10 మంది అర్చకులకు కరోనా సోకడంతో.. శనివారం ఆలయంలో పనిచేస్తున్న 300 మంది సిబ్బందికి పరీక్షలు చేశారు. దీంతో మరో 29 కొత్తకేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం వారంతా హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఈ నెల 14 వరకు ఆలయంలో దర్శనాలు, వ్రతాలు రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో త్రినాథరావు వెల్లడించారు. కాగా ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పలువురు భక్తులు ఆలయాన్ని సందర్శించారు. వారందరిలోనూ ఆందోళన నెలకొన్నది. ఇటీవల అన్నవరం వెళ్లిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
- August 8, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- ANNAVARAM
- CARONA
- TEMPLE
- VISIT
- అన్నవరం
- కరోనా
- Comments Off on అన్నవరంలో 39 మందికి కరోనా