Breaking News

అనుక్షణం అప్రమత్తంగా ఉండండి

అనుక్షణం అప్రమత్తంగా ఉండండి

సారథి న్యూస్​, కర్నూలు: కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో మార్గదర్శకాలను పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి కరోనా కట్టడి చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో అధిక సంఖ్యలో బెడ్లను సిద్ధం చేసుకోవడంతో పాటు లక్షణాలు ఉన్న వ్యక్తులను హోం ఐసోలేషన్ లోనే ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ జి. వీరపాండియన్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రధాన క్లస్టర్లలో 4,760 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించగా 95 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించారు.

కర్నూలు, నంద్యాల, ఆదోని మున్సిపల్ ప్రాంతాల్లోని కంటైన్​మెంట్​ క్లస్టర్లలో ఫోకస్ పెట్టి అధికంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్, శాంపిల్స్ సేకరణ, డాక్యుమెంటేషన్ ను పక్కాగా నిర్వహిస్తున్నామని చెప్పారు. జాయింట్ కలెక్టర్-2 రాంసుందర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ, ట్రెయినీ కలెక్టర్ నిధిమీనా, అడిషనల్ డీఎంహెచ్​వో పాల్గొన్నారు.