వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మహిళా అధ్యక్షురాలు ఉండాలని తాను కోరుకుంటున్నాను. అయితే ఈ పదవికి కేవలం తన కూతురు ఇవాంక ట్రంప్ మాత్రమే అర్హురాలని ఆయన పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి ట్రంప్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ తొలిసారిగా న్యూహాంప్షైర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికా అధ్యక్షురాలిగా మహిళను చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ అందుకు కమలా హ్యారిస్ అర్హురాలు కాదు. ఆమె ఓ అసమర్థురాలు. ఆమె కనుక అధ్యక్షురాలు అయితే అమెరికాలో అరాచకశక్తులు పెట్రేగిపోతాయి. అమెరికా అధ్యక్షురాలిగా ఇవాంక ట్రంప్ మాత్రమే అర్హురాలు. కమాలా హారిస్ ఏమన్నా అందగత్తెనా. ఆమె ఓ మాములు వ్యక్తి. కొన్నిరోజులైతే ఆమెను ఎవరూ పట్టించుకోరే. ఇక డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీచేస్తున్న జోడెన్ ఓ అసమర్థుడు. అతడు ఎన్నికైతే అమెరికా సర్వనాశనం అవుతుంది’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘వుయ్ వాంట్ ఇవాంక’ అంటూ అక్కడి ప్రజలు నినాదాలు చేయడం విశేషం.
- August 30, 2020
- Archive
- Top News
- జాతీయం
- AMERICA
- COMMENTS
- DONALD TRUMP
- ELECTIONS
- IVANKA TRUMP
- అధ్యక్షపదవి
- అమెరికా
- ఎన్నికలు
- పోటీ
- ర్యాలీ
- Comments Off on అధ్యక్ష పదవికి ఇవాంకే అర్హురాలు