స్టార్ హీరోయిన్స్ చాలామంది స్పెషల్ సాంగ్స్ చేయాలంటే సై అంటున్నారు. అదే వరుసలో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన పాయల్ రాజ్పుత్కూడా స్పెషల్ సాంగ్‌కు రెడీ అంటోంది. తన మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’తో గ్లామరస్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. అయితే వెంకీమామలో వెంకటేష్ పక్కన సంప్రదాయ పద్ధతి పాత్ర పోషించి మెప్పు పొందింది. తర్వాత తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్ర, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘సీత’ సినిమాలో ప్రత్యేక గీతంలో అలరించింది. ఇలా దేనికదే డిఫరెంట్ పాత్రలతో కెరీర్ లో ముందుకెళ్తోంది. అయితే ఇప్పుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’లో కూడా పాయల్ స్పెషల్ సాంగ్ చేయనుందనే వార్త గుప్పుమంటోంది. కచ్చితంగా ఐటెమ్ సాంగ్ లేనిదే సుకుమార్ సినిమా ఉండదు.
‘ఆర్య 2’లో రింగ..రింగా.. పాట నుంచి ‘రంగస్థలం’ లో జిగేలు రాణి.. పాట వరకూ అన్ని పాటలూ హిట్టయ్యాయి. మొదట ఈ పాట కోసం ఊర్వశి రౌతెలా.. మరో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ ను అనుకున్నా ఇప్పుడు పాయల్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఇండియన్ 2’లో కూడా పాయల్ స్పెషల్ సాంగ్‌లో మెరవనుందనే వార్త ఎప్పటినుంచో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో పాయల్ ఎంతవరకు కనిపించనుందో అధికారిక కన్ఫమేషన్ అయితే ఇంతవరకు రాలేదు.