బాలీవుడ్ సీనియర్ నటీ భాగ్యశ్రీ పేరు ఎవరికీ పరిచయం చెయ్యనక్కర్లేదు.1989లో విడుదలైన బాలీవుడ్ ఫిల్మ్ ‘మైనే ప్యార్ కియా’తో భాగ్యశ్రీ ఒక్కసారిగా ఎంతో క్రేజ్ సంపాదించింది. తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలు తక్కువ చేసింది. అడపాదడపా సినిమాల్లో మెరుస్తున్న భాగ్యశ్రీ మళ్లీ పాన్ ఇండియా మూవీతో వెండితెర పైకి రానుంది. ఈమె ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ కొత్త మూవీ ‘రాధేశ్యామ్’లో కీలకపాత్ర పోషిస్తుంది. రీసెంట్గా భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఆ ఇంటర్వూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ‘మొదటిసారి బాహుబలి మూవీ చూసినప్పుడు హీరో ప్రభాస్ పై మంచి ఒపీనియన్ వచ్చింది. అతను పాన్ ఇండియా స్టార్ అయినా కూడా ఎంతో నిరాడంబరుడు.. మర్యాదస్తుడు. అతని కలుపుగోలుతనం చూసి ఆశ్చర్యపోయాను. అతనో టీమ్ ప్లేయర్’ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది భాగ్యశ్రీ. నిజానికి భాగ్యశ్రీ అడవి శేష్ హీరోగా నటించిన ‘2స్టేట్స్’ మూవీతో తెలుగు రీఎంట్రీ ఇవ్వాలి. కానీ ఎందుకో ఆ సినిమా ఆలస్యమవుతూ వస్తుంది. ప్రస్తుతం భాగ్యశ్రీ తెలుగు మాత్రమే కాకుండా పలు భాషల సినిమాల్లో నటిస్తోంది. 1997లో రాజశేఖర్ హీరోగా నటించిన ‘ఓంకారం’ మూవీ తర్వాత తెరపై మళ్లీ కనిపించలేదు. దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై మెరవనుంది.