Breaking News

అటవీ శాతాన్ని పెంచాలి

రామడుగులో హరితహారం

సారథిన్యూస్, రామడుగు: రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అటవీ విస్తీరణాన్నీ 33 శాతానికి పెంచాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ పేర్కొన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగు తహసీల్దార్​ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. ప్రకృతి వనాన్ని తలపించేలా కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో రామడుగు తహసీల్దార్​ చింతల కోమల్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్​ కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో సతీశ్​రావు, వివిధ గ్రామాల సర్పంచులు పంజాల ప్రమీల, కటకం రవీందర్, మానస, ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీకో ఆఫ్షన్ సుక్రోద్దీన్, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్ గౌడ్, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు నరేందరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా వెంకట్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో- ఆర్డినేటర్, జూపాక కరుణాకర్​ తదితరులు పాల్గొన్నారు.