జీవిత, రాజశేఖర్ ఇద్దరు డాటర్స్ వెండితెరపై మెరవడానికి రెడీ అయ్యారు. రెండో కూతురు శివాత్మిక ఇప్పటికే ‘దొరసాని’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచిపేరు సంపాదించింది. ఇక మొదటి కూతురు శివానీ ఎంట్రీ మాత్రం కాస్త లేటైంది. అసలు రెండేళ్ల క్రితమే అడవి శేష్ తో ‘టూ స్టేట్స్’ తెలుగు రీమేక్‌తో శివానీ ఎంట్రీ ఉంటుందనుకున్నారు. అది అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు సుమంత్‌తో ‘విక్కీడోనర్’ రీమేక్ ‘నరుడా డోనరుడా’ తీసిన మల్లిక్ రామ్ దర్శకత్వంలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది శివానీ.
బుధవారం శివానీ పుట్టిన రోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ‘ఇంద్ర’ సినిమాతో పాటు పలు చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు.. ఇటీవల ‘ఓ బేబి’ సినిమాలో సమంత మనుమడిగా రీఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జ హీరోగా చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వెన్నెల అనే పాత్రలో కనిపించనుందట శివానీ. షూటింగ్ కూడా పూర్తి కావచ్చిందట. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక విడుదల చేయనున్నారు. లేటుగానైనా లేటెస్ట్గా పరిచయం అవుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది శివానీ. మరి చెల్లి శివాత్మిక లాగే శివానీ కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటుందో లేదో చూడాలి.