గ్లామర్ తో మైమరపించి.. డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసి ఫ్యాన్స్‌ను ఫిదా చేసే మిల్క్ బ్యూటీ తమన్నా స్టైల్ హీయిన్గానే కాకుండా అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ తో కూడా అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇటీవల ఓ అభిమానితో లైవ్ చాటింగ్ చేస్తున్నప్పుడు.. అన్ని సినిమాలున్నా స్పెషల్ సాంగ్స్ ఎందుకు చేస్తున్నారు? అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది..
‘నేను స్పెషల్ సాంగ్స్ చేయడాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. డబ్బు కోసమే అలాంటి పాటలు చేస్తున్నానని కూడా అంటున్నారు. అలాంటి వారి మాటలు నేనసలు పట్టించుకోను.. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.. నా డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించే అవకాశం ఆ పాటలతో కలుగుతోంది. పైగా వీటి వల్ల గతంలో నేను పని చేసిన స్టార్స్ తో పనిచేసే అవకాశం కూడా వస్తోంది.. అందుకే నేను స్పెషల్ సాంగ్స్ చేస్తున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది గ్లామరస్ డాల్ తమన్నా. ప్రస్తుతం తమన్నా సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీ మార్’లో లేడీ కబడ్డీ కోచ్ గా నటిస్తోంది.