Breaking News

‘నవోదయ’లో ప్రవేశాలకు నోటిఫికేషన్​

‘‘నవోదయ’’లో ప్రవేశాలకు నోటిఫికేషన్​

సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం నవోదయ విద్యాలయంలో 2020––21 అకాడమిక్ ఆరవ తరగతిలో చేరేందుకు విద్యార్థుల ప్రవేశపరీక్షకు శుక్రవారం నోటిఫికేషన్​విడుదలైందని ప్రిన్సిపల్ ​వీరరాఘవయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 80 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా పరిధిలో ఐదవ తరగతి చదివిన విద్యార్థులు ఆన్​లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. సీబీఎస్​ఈ బోధన ఉంటుంది. ఆ న్​లైన్​ అప్లికేషన్ గడువు నవంబర్ 30 వరకు ఉంది. ఏప్రిల్​10న పరీక్ష నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు ఈ కింద పేర్కొన్న సైట్​లో చూడవచ్చు. అదనపు సమాచారం కోసం సమీపంలోని నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్​ను సంప్రదించవచ్చు.

https://navodaya.gov.in/nvs/en/Admission-JNVST/Admission-Notifications/.