![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/honey-trappff.jpg?fit=729%2C411&ssl=1)
ఆమె ఓ అందమైన యువతి.. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈజీ మనికి అలవాటు పడింది. డబ్బున్నవాళ్లను పరిచయం చేసుకోవడం.. వారిని ముగ్గులోకి దించడం ఆమె హాబీ. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు లేదా సోషల్మీడియాలో ఆమె ధనవంతులను పరిచయం చేసుకుంటుంది. తర్వాత వారితో మత్తెక్కించేలా మాట్లాడుతుంది. అనంతరం వాళ్లను తన ఇంటికి తీసుకెళ్లి.. శారీరకంగా లొంగదీసుకుంటుంది. అనంతరం అక్కడ సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీస్తుంది. ఆ తర్వాత ఆ వీడియోలు సోషల్మీడియాలో పెడతానంటూ బెదిరించి లక్షల్లో డబ్బు గుంజుతుంది. ఈ కిలాడి యువతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన ఓ యువతి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నది. సదరు యువతి పాల్వంచ పట్టణంలో ఆర్ధికంగా స్ధిరపడిన వ్యక్తులను టార్గెట్ చేస్తున్నది. కాగా ఇటీవల పాల్వంచ లోని శాస్త్రి రోడ్డుకు చెందిన ప్రముఖ వ్యాపారిని ఈ యువతి ట్రాప్ చేసింది. అనంతరం అతడితో గడిపింది. ఆ సమయంలో వీడియోలు తీసింది. అనంతరం ఈ విషయాన్ని వ్యాపారికి చెప్పి బెదిరించటం మొదలెట్టింది. తనకు రూ. 10 లక్షల రూపాయలు ఇవ్వాలని… లేకపోతే ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించింది. దీంతో ఈ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు డబ్బిస్తామంటూ సదరు యువతిని రప్పించి అరెస్ట్ చేశారు.