సారథి న్యూస్, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న మాదాపూర్ లోని రిజైన్ స్కై బార్ పబ్ ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. కరోనా రూల్స్ కు విరుద్ధంగా జనం గుమిగూడడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించలేదని నిర్ధారించారు. బార్లో పనిచేసే వెయిటర్లు ఎక్కడా మాస్క్‌లు కట్టుకోలేదని గుర్తించారు. పబ్ లో రష్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎక్సైజ్ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. ఉదయం పబ్ పై రైడ్ నిర్వహించిన అధికారులు కస్టమర్లు, సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టే విధంగా యాజమాన్యం వ్యవహరించిందని నిర్ధారించి పబ్ ను సీజ్ చేశారు. ఎక్సైజ్ చట్టం సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు.
- October 13, 2020
- Archive
- క్రైమ్
- CAROONA
- EXCISEBAR
- HYDERABAD
- REGION SKY BAR
- ఎక్సైజ్‌శాఖ
- కరోనా
- రిజైన్ స్కై బార్ పబ్
- హైదరాబాద్
- Comments Off on రూల్స్ పాటించని పబ్ సీజ్