ముంబై: సుశాంత్ రాజ్పుత్ మృతికేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని మంగళవారం ఎన్సీబీ ( నార్కొటిక్ కంట్రోల్ బ్యూర్) అరెస్ట్ చేసింది. రియా అరెస్ట్ అవుతారంటూ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా డ్రగ్స్ మాఫియాతో రియాకు సంబంధాలున్నట్టు ఎన్ సీబీకి కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మూడురోజుల పాటు ఎన్సీబీ రియాను విచారించింది. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య కేసును విచారిస్తున్న సీబీఐకి డ్రగ్స్ మాఫియా వ్యవహారం తెలిసింది. దీంతో రియా కేసును ఎన్సీబీ అధికారులు దర్యాప్తు చేశారు. అయితే రియా మరో 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు చెప్పినట్టు సమాచారం.