Breaking News

హైవే పనులు పూర్తిచేయాలి

హైవే పనులు పూర్తిచేయాలి

సారథి న్యూస్, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో నేషనల్ హైవేల వెంట మంజూరైన అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు సూచించారు. సోమవారం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఎన్ హెచ్ -9, ఎన్ హెచ్- 44 రూట్లలో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. మల్కాపూర్ బ్రిడ్జి వద్ద సైడ్ డ్రెయిన్లు పూర్తిచేయకపోవడంతో వర్షపు నీరు నిలిచి‌ ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ గ్రామం వద్ద హైవే వెంట రోడ్డు పనులు కంప్లీట్​ చేయాలన్నారు.

సదాశివపేట‌- నిజాంపూర్ క్రాస్‌రోడ్ వద్ద వెహికల్ అండర్ పాస్ ఏర్పాటు చేయాలని సూచించారు. నాగ్ పూర్ హైవే రోడ్ లో నాగులపల్లి వద్ద ఆర్​యూబీ పనులు కంప్లీట్​ చేయాలన్నారు. టోల్ గేట్ నుంచి 20 కి.మీ. పరిధిలో ఉండే వారికి నెలవారీ పాస్ 50 శాతం తక్కువ ధరకే ఇస్తున్నామని, నెలలో ఎన్ని సార్లయినా వారు టోల్ గేట్ నుంచి వెళ్లొచ్చని కాంట్రాక్ట్​ ప్రతినిధులు తెలిపారు. హైవే పనులపై ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రామాయంపేటలో వెహికల్ అండర్ పాస్, చేగుంట వద్ద సర్వీస్ రోడ్, దండుపల్లిలో సర్వీస్ రోడ్ నార్సింగిలో వెహికల అండర్ పాస్, రెడ్డిపల్లి వద్ద సర్వీస్ రోడ్ నిర్మించాలని సూచించారు. సమావేశంలో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.